అండగా నిలవండి అభివృద్ధి చేసి చూపిస్తా

8వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి జుట్ల అనిత
మక్తల్ , ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు అండగా నిలవండి ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జుట్ల అనిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 8వ వార్డు పరిధిలోని గార్లపల్లి గ్రామంలో తన మద్దతు ధరలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో జుట్ల అనితకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి కోసం పని చేస్తానని అన్నారు .
ప్రస్తుతం సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డ్ నుండి పోటీ చేస్తున్న తాను ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని అన్నారు.2హ8వ వార్డు పరిధిలోని ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని సిసి రోడ్లు డ్రైనేజీలు పనులు జరుగుతున్నాయి అన్నారు. మరింత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రి శ్రీహరి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా జుట్ల అనిత ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కావాలి ఆంజనేయులు, అశోక్ గౌడ్, ఆర్ఎంపి శంకర్, జట్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
