790 hectares | హైద‌రాబాద్ నుంచి చెన్నైకు బుల్లెట్ ట్రైన్

790 hectares | హైద‌రాబాద్ నుంచి చెన్నైకు బుల్లెట్ ట్రైన్

కొత్త రూట్‌కి డీపీఆర్ ఖ‌రారు
శంషాబాద్, హాలియా, వాడపల్లి మీదుగా రైలు రూట్
బాటసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మార్గం క‌ట్
ఏకంగా 116 కిలోమీట‌ర్ల త‌గ్గిన‌ దూరం
భారత్‌ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి లో స్టేష‌న్ల నిర్మాణం

790 hectares | న్యూ ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడును అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు కారిడార్‌’ ప్రాజెక్టు రూట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా సాగే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌ను నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ సంస్థ మార్చింది. గతంలో తెలంగాణ పరిధిలో ప్రతిపాదించిన పాత మార్గాన్ని కాదని.. భౌగోళిక, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రూట్‌ను ఖరారు చేశారు. ఈ కొత్త మార్గానికి సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ ప్రస్తుతం అత్యంత వేగంగా కొనసాగుతోంది.

790 hectares |
790 hectares |

790 hectares | కొత్త ఎలైన్‌మెంట్‌తో భారీగా త‌గ్గిన దూరం..

తొలుత రూపొందించిన ప్రణాళిక ప్రకారం.. ఈ హైస్పీడ్ కారిడార్ తెలంగాణలోని శంషాబాద్‌లో ప్రారంభమై బాటసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే, ఈ పాత రూట్ ప్రకారం తెలంగాణలోనే ఈ ప్రాజెక్టు దూరం సుమారు 236 కిలోమీటర్లుగా తేలింది. ఇంత భారీ దూరానికి గానూ దాదాపు 790 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ, మారిన కొత్త ఎలైన్‌మెంట్‌ ప్రకారం ప్రాజెక్టు దూరం ఊహించని విధంగా భారీగా తగ్గింది. కొత్త రూట్ వల్ల తెలంగాణ పరిధిలో ఈ దూరం కేవలం 123 కిలోమీటర్లకు పరిమితం కానుంది. ఈ మేరకు ప్రాజెక్టు దూరం దాదాపు సగానికి సగం తగ్గిపోనుండటం విశేషం. ఇదే విషయాన్ని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ సంస్థ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.

790 hectares | రాష్ట్రంలో మొత్తం నాలుగు స్టేషన్లు..

కొత్త ఎలైన్‌మెంట్‌ ప్రకారం.. శంషాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో భారత్‌ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి మీదుగా ముందుకు సాగనుంది. ఈ కొత్త మార్గంలో బుల్లెట్ రైళ్లు ఆగేందుకు వీలుగా రాష్ట్రంలో మొత్తం నాలుగు స్టేషన్లను నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ సంస్థ ప్రతిపాదించింది. ఇందులో భారత్ సిటీ మినహా మిగిలిన మూడు స్టేషన్లయిన డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి ప్రాంతాలు నల్ల‌గొండ జిల్లా పరిధిలోకి రావడం గమనార్హం. వాస్తవానికి భారత్ సిటీ, వాడపల్లి మార్గంలోనే చెన్నై హైస్పీడ్ కారిడార్ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ కోరికకు అనుగుణంగానే ఈ కొత్త ఎలైన్‌మెంట్‌ను సిద్ధం చేసి సర్వే నిర్వహిస్తున్నారు.

790 hectares | సరుకు రవాణా వేగంగా, సులువుగా..

ఈ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. డ్రైపోర్ట్ వద్ద ప్రత్యేకంగా హైస్పీడ్ రైలు స్టేషన్‌ను ప్రతిపాదించడం. తెలంగాణ రాష్ట్రానికి సముద్ర తీరప్రాంతం లేకపోవడం పెద్ద మైనస్. ఈ లోటును భర్తీ చేస్తూ అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల సరకు రవాణాను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. సముద్ర తీరంలోని ప్రధాన పోర్టుల నుంచి వచ్చే ఎగుమతులు, దిగుమతుల సరుకులను నిల్వ చేయడం, కస్టమ్స్ క్లియరెన్స్ ఇవ్వడం, లోడింగ్ వంటి కీలక ప్రక్రియలన్నీ ఈ డ్రైపోర్ట్ వేదికగా జరుగుతాయి. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో బుల్లెట్ రైలు స్టేషన్ రావడం వల్ల భవిష్యత్తులో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు, పోర్టులకు సరుకు రవాణా అత్యంత వేగంగా, సులువుగా మారుతుంది. పారిశ్రామిక వృద్ధికి, పెట్టుబడులకు ఈ మార్పు ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

CLICK HERE TO READ MORE : TiffanyTrump | భార‌త్‌లో.. ట్రంప్ కుమార్తె

LICK HERE TO READ MORE

Leave a Reply