అభివృద్ధి చేస్తాను ఆదరించండి

5 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కర్నె గంగామణి ( గంగయ్య )
భీమ్‌గల్ టౌన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ ): చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ అందించాలని 5 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కర్నె గంగామణి ( గంగయ్య ) కోరారు. బుధవారం ఐదో వార్డు లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్తించారు. కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అన్నారు. ఒక్కసారి ప్రజా సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అధికార పార్టీ కి ఓటు వేయడం ద్వారా వార్డు అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఐదో వార్డు సభ్యులకు అందుబాటులో ఉండే తనను ఆదరించి, చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వార్డు లో మురికి కాలువలు, సీసీ రోడ్స్, మురికి కాలువల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు తదితర మౌలిక వసతులు చేస్తానని పేర్కొన్నారు. వార్డు ను బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్ సహకారం తో వార్డు ను ఆదర్శం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
