565 marks | “పది” ప్రతిభావంతులకు విమాన ప్రయాణం

565 marks | “పది” ప్రతిభావంతులకు విమాన ప్రయాణం
- పంచాయతీ కార్యదర్శి గంటసాత్విక్
565 marks | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 565 మార్కుల(565 marks) కంటే ఎక్కువ తెచ్చుకుంటే విద్యార్థులను విమానంలో ఒక ప్రదేశానికి సొంత ఖర్చులతో తీసుకెళ్తానని నర్సింహులపేట మండలం అజ్మీరాతండా గ్రామ పంచాయతీ కార్యదర్శి గంటసాత్విక్(Ganta Sattvik) అన్నారు.
పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మండలంలోని పెద్దనాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు స్టడీ అవర్ లో స్నాక్స్ కోసం రూ.12 వేలు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకి సుమన మాట్లాడుతూ.. పుట్టినరోజు వేడుకలకు కొంతమంది అనవసరమైన ఖర్చులు చేస్తారని పంచాయతీ కార్యదర్శి సాత్విక్ ప్రభుత్వ పాఠశాల పిల్లలను ప్రోత్సహించడానికి ఉపయోగించడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో(public schools)నే నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం సికిందర్, రాజు, లచ్చు నాయక్, నాగేష్ విద్యార్థులు తదితరులు ఉన్నారు.
