4hours |నేడు భారీ సంఖ్యలో లొంగుబాటు

4hours | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. సీఎం ఏ.రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోనున్నారు. 126 మంది మావోయిస్టులు సరెండర్ చేస్తున్నారని సమాచారం. ఇందులో అగ్రనేత దేవ్‌జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం లొంగిపోతున్నట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్లో మీడియా సమావేశం నిర్వహించి ఈ భారీ లొంగుబాటుపై అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. ఇది తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఊపిరిగా మారనుంది. గతంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు ఇప్పుడు కీలక మలుపు రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
