ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
విజయవాడ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, గుణదల మండలం 3, 4, 5వ డివిజన్లలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సతీష్ జస్తి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాళ్లు మాధవి కె, సుభాషిణి పాలడుగు, సీనియర్ నాయకులు పీయూష్ దేశాయ్, బీజేపీ ఏపీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు గంగాధర్, మండల అధ్యక్షులు పవన్, లవయ, తులసి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వం, ఏపీలో పి.వి.ఎన్. మాధవ్ నాయకత్వం రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ తరుణ్ కాకాని పేర్కొన్నారు. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా ప్రకటించడం, ప్రపంచ సంక్షోభ సమయంలోనూ వంట గ్యాస్ మరియు వాహన పెట్రోల్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడటం వంటి చర్యలు సామాన్యులను ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు.
