అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..పేదల పెన్నిధి మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్న

47 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొల్లం భీమయ్య
మంచిర్యాల ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొల్లం భీమయ్య. బుధవారం తన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు సతి సమేతంగా ప్రచారాన్ని ప్రారంభించారు.అభివృద్ధి అంటే 10 ఏళ్లలో మంచిర్యాలలో గెలుపొందిన ప్రజా ప్రతినిధులు చేయలేని పనులు రెండు సంవత్సరాల క్రితం గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయలతో మంచిర్యాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి జరగాలంటే హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీని అందజేయాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచారంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు రామగిరి బానిష్,కాసర్ల శ్రీనివాస్,లు పాల్గొని కాంగ్రెస్ పార్టీ విజయానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం పరిచారు. ప్రచారంలో మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చంద్రశేఖర్,బోయిని పద్మ, తదితరులు పాల్గొన్నారు.
