గతంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఓటివ్వండి

గతంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఓటివ్వండి
- 38వ వార్డ్ బీఎస్పీ కౌన్సిలర్ అభ్యర్థి శరణ్య వంశీకృష్ణ
నిర్మల్ టౌన్ , ఆంధ్రప్రభ : గతంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఓటివ్వండనీ 38వ వార్డ్ బీఎస్పీ కౌన్సిలర్ అభ్యర్థి శరణ్య వంశీకృష్ణ ఓటర్లను కోరారు. ఈ మేరకు శుక్రవారం 38 వార్డులో ఇంటింటా తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నామని.,మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజాసేవకు అంకితం అవుతామని అన్నారు. గతంలో కౌన్సిలర్ గా ఉన్న సమయంలో కాలనీలో ఎలాంటి సమస్యలు లేకుండా చేశానని ఓటర్లకు గుర్తు చేశారు.
వార్డులో సీసీ రోడ్లు ,డ్రైనేజీలు, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పారిశుద్ధ నిర్వాహన ,మౌలిక సదుపాయాల కల్పన కోసం అహర్నిశలు కృషి చేస్తామని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సేవలు అందిస్తామని. అన్నారు. తమకు ఈ ఒక్కసారి అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజలకు రుణపడి ఉంటామని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట కార్యకర్తలు ,కాలనీవాసులు పాల్గొన్నారు.
