304 crore | రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు….

304 crore | రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు….

  • ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం

304 crore | అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ది, ఆత్మగౌరవానికి పెద్ద పీట వేసి మహిళా శక్తీకరణ దిశగా మరో కీలక అడుగు వేసిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మేల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ(MLA Dr. Sikudu Vamsikrishna) ఈ రోజు ఒక వీడియో సందేశంలో తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గత ప్రభుత్వాలు మహిళాభివృద్దికి ఎవ్వరూ చేయని విధంగా రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని, అందులో భాగంగానే 3 లక్షల 57 వేల 98 గ్రామీణ మహిళా(3 lakh 57 thousand 98 rural women) స్వయం సహాయక సంఘాలకు 304 కోట్ల వడ్డీ(304 crore interest) లేని రుణాలను ఈ రోజు వారి ఖాతాల్లోకి జమచేశారని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు అచ్చంపేట నియోజకవర్గ మహిళా స్వయం సహాయక బృందాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని అన్నారు.

మహిళల ఆత్మగౌరవం, ఆర్థిక స్వావ‌లంబన కోసం తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నిజమైన సంక్షేమ దిశగా పనిచేస్తోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రంలోని కోటి మందికి పైగా మహిళలకు అత్యంత నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలను అందించే కార్యక్రమం ప్రారంభమై గత మూడు రోజులుగా నియోజకవర్గంలో పంపిణీ చేయబడుతున్న చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

స్వయం సహాయక బృందాలకు రుణాలు, చీరల పంపిణీ, మహిళా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక శక్తీకరణకు ప్రాధాన్యతనిస్తోందని, గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి ప్రోత్సాహం, కుటుంబాభివృద్ధికి దోహదం చేసే విధంగా కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు.

Leave a Reply