బిజెపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..

బిజెపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..
ఓటర్ తో మాట్లాడుతున్న డాక్టర్ కాళీ ప్రసాద్ రావు
డాక్టర్ కాళీ ప్రసాద్ రావు ఓటర్లకు విజ్ఞప్తి
22 వ వార్డులో విస్తృత ప్రచారం
పరకాల, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ): భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని 22వ వార్డు బిజెపి అభ్యర్థి కొలనుపాక భద్రయ్య కోసం 22వ వార్డులోని సగర వీధి తదితర వీధుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచార లో భాగంగా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ 22వ వార్డు బిజెపి అభ్యర్థి కొలనుపాక భద్రయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ కాళీ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలే బిజెపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తాయన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి 22వ వార్డ్ అభ్యర్థి కొలనుపాక భద్రయ్య, బిజెపి జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, బిజెవైఎం నాయకులు కొలనుపాక అనిల్, సిద్దు నాగరాజు, నాయకులు, నాయకురాళ్లు ఉన్నారు.
