2025 Heroines | సరికొత్త అందాలు..

2025 Heroines | సరికొత్త అందాలు..

2025 Heroines | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నాటి నుంచి నేటి వరకు తెలుగు తెరకు ఎంతో మంది కథానాయికలు పరిచయం అయ్యారు. అందం, అభినయంతో ఆకట్టుకుని.. ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అయితే.. ఎంత మంది కథానాయికలు (heroines) వచ్చినా.. తెర పై ఇంకా ప్లేస్ మాత్రం ఉంటూనే ఉంటుంది. అందుకనే.. ప్రతి సంవత్సరం అందమైన భామలు.. లేత మెరుపు తీగలు.. తెర పై అందాలతో కనువిందు చేస్తుంటారు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.. మరి.. 2025లో తెలుగు తెరకు పరిచయమైన మెరుపు తీగలు.. కొంత మంది గురించి.. క్లుప్తంగా మీ కోసం..

2025 Heroines | ముద్దుగుమ్మ భాగ్యశ్రీ..

ఈ సంవత్సరంలో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ.. మెరుపు తీగ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) గురించే. ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కింగ్ డమ్, రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్ కాంత సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ కు జంటగా లెనిన్ అనే సినిమాలో నటిస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకెళుతుంది భాగ్యశ్రీ బోర్సే.

2025 Heroines

2025 Heroines | లక్కీ.. రుక్మిణి వసంతన్..

ఈ అమ్మడు.. కన్నడ బ్యూటీ.. సప్త సాగరాలు దాటి అనే కన్నడ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించిందనే పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో డైరెక్ట్ గా తెలుగు తెర పై మెరసింది. అయితే.. ఊహించని విధంగా ఈ కన్నడ బ్యూటీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీలో రుక్మిణి వసంతన్ నటిస్తుంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ.. మరో పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఇటీవల కాంతార చాప్టర్ 1 లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

2025 Heroines

2025 Heroines | అందాల నిధి..

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది నిధి శెట్టి. ఈ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3లో నటించింది. శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 సినిమా టైటిల్ కు తగ్గట్టే హిట్ అయ్యింది. రీసెంట్ గా సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా సినిమాలో నటించింది. ఈ మూవీ యావరేజ్ గానే నిలిచినా నిధి మాత్రం పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది. ఇప్పుడు ఏకంగా విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh ) మూవీలో నటించే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఆనంద నిలయం మూవీ సమ్మర్ లో వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమానే కాకుండా మరికొన్ని ఆఫర్స్ దక్కించుకుందని సమాచారం.

2025 Heroines

2025 Heroines | మెరుపు తీగలు..

కాంతార సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సప్తమీ గౌడ్ కూడా తెలుగులో అవకాశాలు దక్కించుకుంది. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తేజా సజ్జా మిరాయ్ సినిమాతో రితికా నాయక్ తెలుగులో పేరు తెచ్చుకుంది. తెలుగులో రితికా మొదటి సినిమా విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం. తర్వాత హాయ్ నాన్న లో కూడా సహాయక పాత్రలో మెరిసింది కానీ.. ఈ సినిమాలు నాయర్ కి గుర్తింపు ఇవ్వలేదు. అయితే.. మిరాయ్ (Mirai) సినిమాతో మాత్రం సక్సెస్ సాధించి గుర్తింపు తెచ్చుకుంది. కిరణ్‌ అబ్బవరం కే ర్యాంప్ మూవీతో యుక్తి తరేజా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. లవ్ టుడే సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఇవానా శ్రీవిష్ణు సింగిల్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. కన్నప్పతో మలయాళ బ్యూటీ ప్రీతి ముకుందన్, మెగ్లీతో సాక్షి మదోల్కర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. వీరే కాకుండా.. చిన్న సినిమాల ద్వారా మరి కొంత మంది అందాల భామలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మరి.. కొత్త సంవత్సరంలో ఇంకెంత మంది అందాల భామలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారో చూడాలి.

2025 Heroines
2025 Heroines

CLICK HERE TO READ పవర్ ఫుల్ రోల్ లో.. విజయ్

CLICK HERE TO READ MORE

Leave a Reply