సింగూరులోకి 20 వేల క్యూసెక్కులు

సింగూరులోకి 20 వేల క్యూసెక్కులు

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : సింగూర్ ప్రాజెక్టు(Singur project) ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకులోకి 20వేల క్యూసెక్కుల‌ వరద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అందుకు అనుగుణంగా నీరు విడుద‌ల చేస్తామ‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నీటిపారుద‌ల శాఖ డీఈఈ నాగరాజు తెలిపారు.

ఈ రోజు మధ్యాహ్నం ప్రాజెక్టు నుంచి 20 వేల క్యూసెక్కుల‌(20 thousand cusecs) నీటిని దిగువ‌కు విడుదల చేయనున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. రెండు మీట‌ర్ల మేర 14వ గేటును ఎత్తి నీటిని విడుద‌ల చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్రాజెక్టు  దిగువ ప్రాంతాల వారు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలర‌ని సూచించారు. ముఖ్యంగా మంజీరా నది(Manjira River) పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులు, గొర్ల  కాపరులు, చేపల వేటకు నదిలోనికి వెళ్లరాదని ఈ సంద‌ర్భంగా నాగరాజు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply