2 Us Jets 1 Drone : పెంట గాన్ నీరసం Andhra Prabha News

2 Us Jets 1 Drone : పెంట గాన్ నీరసం Andhra Prabha News
- 2 వార్ జెట్లు ధ్వంసం
- ఒక నిఘా డ్రోన్ మటాష్
- టెహ్రన్ గగన తలం గగనమే
- ఇస్ఫహాన్ వద్ద MQ-9 డ్రోన్ కూల్చివేత
- బవార్-373, ఖోర్దాద్-15తో ప్రతిఘటన
- హోర్ముజ్ సమీపంలో అమెరికా యుద్ధ విమానాల పతనం
- IRGC సత్తా చాటిన వాయు రక్షణ దళాలు
- చర్చలపై ప్రభావం లేదు
- ట్రంప్ స్పందన
- అమెరికా అవాక్కు
( ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి)

తమ గగన తలంలో ప్రవేశిస్తే.. నరకం తలుపు తట్టినట్టేనని ని అమెరికాకు ఇరాను హెచ్చరించింది. గడచిన 24 గంటల్లో తమ గగన పరిధిలోకి వెళ్లిన రెండు అమెరికా యుద్ధ విమానాలను… మరో డ్రోన్ ను ఇరాన్ కూల్చివేసింది. తమ వాయురక్షణ దళం సత్తాను చూపింది. ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో అమెరికా డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం శనివారం మద్యాహ్నం 12.00 నుంచి 12.45 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా MQ-9 డ్రోన్‌ను పసిగట్టిన ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తన “అధునాతన ఆధునిక” వాయు రక్షణ వ్యవస్థలను ప్రయోగించి ఈ డ్రోన్‌ను ధ్వంసం చేశాయి. ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లోని అణు కేంద్రాల సమీపంలో అమెరికా నిఘా డ్రోన్‌ను తమ అధునాతన వాయు రక్షణ వ్యవస్థలతో కూల్చివేసినట్లు ఇరాన్ ధృవీకరించింది ఇరాన్ తన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన Bavar-373 . Khordad-15 వంటి క్షిపణి వ్యవస్థలను ప్రయోగించినట్టు సమాచారం.
2 Us Jets 1 Drone : అమెరికా అవాక్కు

గడచిన 24 గంటల కిందట ఇరాన్ దళాలు మరో రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేశాయి. నైరుతి ఇరాన్ , హోర్ముజ్ జలసంధి సమీపంలో ఈ రెండు విమానాలను కూల్చివేశాయి. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌లోని క్షిపణి , అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్న తరుణంలో ఇరాన్ తన వాయు సరిహద్దులను కాపాడుకోవడానికి ఈ చర్యలు చేపట్టినట్లు IRGC తన ప్రకటనలో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఘటనపై స్పందించారు. ఇరాన్ తో చర్చలకు ఈ దాడి ప్రభావం చూపదన్నారు. ఇరాన్ వాయుసేన IRGC (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించటంతో… పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి.
2 Us Jets 1 Drone : ఇదీ ఇరాన్ ప్రతిఘటన .

మూడు అమెరికా వైమానిక లక్ష్యాలను శుక్రవారం అడ్డుకున్నట్లుఇరాన్ తెలిపింది: ఇరాన్‌లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్ నైరుతి ప్రాంతం సమీపంలో అమెరికాకు చెందిన F-15E యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఇందులో ఇద్దరు సిబ్బంది

ఉండగా, ఒకరిని అమెరికా దళాలు రక్షించాయి, మరొకరి కోసం గాలిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలో గ్రౌండ్ అటాక్ విమానం A-10 థండర్‌బోల్ట్ IIను తమ దళాలు కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ విమాన పైలట్‌ను అమెరికా హెలికాప్టర్లు రక్షించినట్లు సమాచారం. కూలిన విమానం నుంచి బయటపడిన అమెరికా పైలట్లను పట్టుకుంటే భారీ బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ, విమానం కూలిన మాట వాస్తవమేనని, ఇది ఇరాన్‌తో చర్చలపై ఎటువంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. 5 వారాలుగా సాగుతున్న ఈ యుద్ధంలో అమెరికా యుద్ధ విమానం ఇరాన్ భూభాగంలో కూలిపోవడం ఇదే మొదటిసారి.
