2 Matches | ఐపీఎల్‌లో డ‌బుల్ హెడ‌ర్‌

2 Matches | ఐపీఎల్‌లో డ‌బుల్ హెడ‌ర్‌

2 Matches | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ ఫ్యాన్స్‌కి సండే వ‌చ్చిందంటే చాలు మస్త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్. ఎందుకంటే వీకెండ్‌లో రెండు మ్యాచులుంటాయి. మధ్యాహ్నం ఒకటి, రాత్రి మరొక మ్యాచ్ జ‌రుగుతాయి. సెల‌వు రోజు కావ‌డంతో అభిమానులంతా ఈ మ్యాచుల‌ను చూడ‌టానికి టీవీల‌కు అతుక్కుపోతారు. మ‌ధ్యాహ్నం నుంచి మొద‌లు పెడితే వ‌రుస‌గా జ‌రిగే మ్యాచుల‌ను చూస్తూ స‌న్‌డేను ఫ‌న్‌డేగా మార్చుకుంటారు. ఆదివారం రోజు ఎక్కువ‌గా టాప్ టీమ్స్ ఆడేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు.

ఐపీఎల్ 2026లో ఈ రోజు రెండు బిగ్ మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ – గుజరాత్ టైటాన్స్ జట్లు ఢీకొన‌నున్నాయి. రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు లక్నో ఇకానా స్టేడియం వేదికగా జరగనుండగా.. రెండో మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవ్వనుంది. ముంబై వాంఖడే వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఉత్కంఠంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ల లైవ్‌లు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

2 Matches

ల‌క్నో వ‌ర్సెస్ గుజ‌రాత్

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ సీజ‌న్‌లో మొద‌టి మ్యాచ్ ఓడిపోయింది. ఆ త‌ర్వాత పుంజుకొని వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించి మంచి ఊపుమీద ఉంది. కోల్‌కతాతో జ‌రిగిన గ‌త మ్యాచులో ఈ జ‌ట్టు ఆట‌గాడు ముకుల్ చౌదరి సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడి హీరో అయ్యాడు. దాంతో లక్నో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఇక గుజరాత్ తొలి రెండు మ్యాచ్‌లలో ఓడి మూడో మ్యాచ్‌లో ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గిల్ సేన ఏడో స్థానంలోఉంది.

ముంబై వ‌ర్సెస్ బెంగ‌ళూర్‌

ఇంక ముంబై విష‌యానికి వ‌స్తే.. ఈ సీజ‌న్ మొద‌టి మ్యాచులో అద్భుత విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల‌లో బోల్తా కొట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో స్ట్రాంగ్ గా ఉన్న‌ప్ప‌టికీ పాండ్యా సేన విజ‌యం సాధించ‌లేక‌పోతోంది. పాయింట్ల పట్టికలో ఈ జ‌ట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు విజయాలు సాధించి అదే జోష్ కొనసాగిస్తుంది అనుకునేలోపే.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Leave a Reply