తొర్రూరు టౌన్ ఫోటో వదిన వార్డుల విస్తృత ప్రచారం చేస్తున్న రియాల్టర్ రాజేందర్.

తొర్రూరు టౌన్ ఫోటో వదిన వార్డుల విస్తృత ప్రచారం చేస్తున్న రియాల్టర్ రాజేందర్.
మా అన్న వదినలను గెలిపించండి అభివృద్ధి చేసి చూపెడుతా ..
ప్రముఖ రియాల్టర్ రాజేందర్ యాదవ్
తొర్రూర్ టౌన్ ఫిబ్రవరి 15( ఆంధ్రప్రభ) : అధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా 15వ వార్డు నుండి బొమ్మర పోయిన సుజాత వెంకన్న ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సోమవారం 15 వార్డులోప్రముఖ తొర్రూరు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బొమ్మన బోయిన రాజేందర్ యాదవ్ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో రాజేందర్ మాట్లాడు తూ నేను రియాల్టర్ గా తొర్రూర్ లో అన్ని కుల సంఘాలవారికి ,యువకులకు , అనేక సేవా కార్యక్రమాలకు, కోట్లల్లో సహకారం చేశాను. నేను మాటలు చెప్పే వాడిని కాదు,చేతలు చేసి చూపించే వ్యక్తిని అది మీ అందరికీ తెలుసు. మా వదిన సుజాత వెంకన్న ని అత్యధిక మెజారిటీ తో దీవించి ఆశీర్వదించి గెలి పించండి ,మీరు ఏ పనులు అడిగినా చేసే బాధ్యత నాది ఈ ఒక్కసారి నా మనిషిని గెలిపించండి మీకు అన్ని విధాలా తోడుగా కష్టసుఖాల్లో అండగా నేనుంటాను అన్నారు. నేను మాట ఇస్తే తప్పే వాడిని కాదు మీ అందరికీ తెలుసు అధికార పార్టీ వారిని గెలిపించుకుంటే అభివృద్ధి కూడా అద్భుతంగా జరుగుతుందన్నారు . ఆలోచించి ఒక అవకాశం మాకు ఇవ్వండి మీ మేలు మర్చిపోము 15వ వార్డు ఓటర్ మహాశయులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ అభ్యర్థిస్తున్నాను అని ఒక్క అవకాశం ఇచ్చి సుజాత వెంకన్న లను గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు
