కడెంలో శ్రీ సాయిబాబా ఆలయ 14వ వార్షికోత్సవం ఘనంగా

కడెం, ఆంధ్రప్రభ: మండల కేంద్రం కడెం పెద్దూరు సమీపంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో 14వ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 1న బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు, అభివృద్ధి కమిటీ సభ్యుడు రమేష్ ఆచార్య తెలిపారు.

ఈ సందర్భంగా ఉదయం 5:30 గంటలకు సాయిబాబా అభిషేకం, ఉదయం 8:30 గంటలకు కుంకుమార్చన, హవనం, హోమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి, భజన కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

సాయంత్రం 5:30 గంటలకు పల్లకి సేవ, రాత్రి 10 గంటలకు శేష హారతి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ అర్చకుడు కోరారు.

Leave a Reply