ఎంపీ పరిధిలో అసెంబ్లీ స్థానాల పెంపు 4…??

ఎంపీ పరిధిలో అసెంబ్లీ స్థానాల పెంపు 4…??

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రకటన నేపథ్యంలో 50 శాతం అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని కేంద్రం ప్రకటించిన విషయం అందరికీ విధితమే .ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు 4 లేదా మూడు పెరగవచ్చని తెలుస్తుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తంగా 14 స్థానాలు అసెంబ్లీ లో ఉండగా 50% శాతం సీట్లు పెరిగితే మొత్తంగా 21 అసెంబ్లీ స్థానాలు అవుతాయి .ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ ఉన్నాయి.

రెండు పార్లమెంటు నియోజకవర్గ లకు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి.నాగర్కర్నూల్ పార్లమెంటు పరిధిలో మూడు లేదా నాలుగు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సర్వత్ర చర్చ జరుగుతున్నది. రాజకీయ వర్గాల్లో మొదట చాలా రోజుల నుండి డీ లిమిటేషన్ జరిగితే నాగర్కర్నూల్ పార్లమెంటు పరిధిలో పెబ్బేరు లేదా కొత్తకోట నాగర్ కర్నూలు జిల్లాలో ఆమనగల్లు అవుతాయని అసెంబ్లీ స్థానాలు అవుతాయని ప్రచారంలో ఉంది.

ఇది ఇలా ఉండగా ఇటీవల పెద్ద కొత్తపల్లి లేదా వంగూరు మండలాలు కూడా అసెంబ్లీ స్థానాలు అవుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఒక అసెంబ్లీ స్థానానికి రెండు లక్షల 20 వేల ఓట్లు పైగా ఉండగా దానిని 1,40,000 నుండి 1,60,000 మధ్యలో అసెంబ్లీలో జనాభా ఉండేవిధంగా చేసి అసెంబ్లీ స్థానాలను పెంచే అవకాశాలు ఉన్నాయి.. ఏ అసెంబ్లీ స్థానం రిజర్వేషన్లు ఎస్సీ , ఎస్టీ, మహిళ, జర్నల్ స్థానాలు అవుతాయని చర్చ కూడా జరుగుతున్నది. లెక్క ప్రకారం ఏడు లేదా ఎనిమిది అసెంబ్లీ స్థానాలవుతే ఇందులో రెండు ఎస్సీ రిజర్వు ,ఒకటి ఎస్టీ రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మిగతా నాలుగు స్థానాలు జర్నల్ రిజర్వ్ కాగా అందులో కూడా మహిళా రిజర్వేషన్లు అవకాశం ఉన్నాయి మహిళలకు కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయి .మహిళల శాతం అధికంగా ఉన్న నియోజకవర్గాలను మహిళల కేటాయించితారని, ఎస్సీ ఎస్టీ జనాభాను బట్టి ఆయా స్థానాలలో ఎంపిక చేస్తారని తెలుస్తోంది. డి లిమిటేషన్, రిజర్వేషన్లు అసెంబ్లీ స్థానాల పెంపుదల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే అమలు అవుతాయని తెలుస్తోంది ఏదేమైనా కేంద్రం జనాభా ప్రతిపాదికన 50 శాతం పెంపుదల అసెంబ్లీ స్థానాలవి చేస్తే నాలుగు లేదా మూడు స్థానాలు అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Leave a Reply