14 Dead | లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్

14 Dead | లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్
14 Dead | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది మృతి చెందడానికి ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సు పరిస్థితి, డ్రైవింగ్ లోపాలు ఈ విషాదానికి దారితీశాయని వెల్లడైంది.
పోలీసుల విచారణలో బస్సు సాంకేతికంగా సరిగా లేకపోయినా దాన్ని రోడ్డుపై నడిపించినట్లు బయటపడింది. అంతేకాకుండా లైసెన్స్ లేని వ్యక్తితో బస్సును నడిపించారని తేలింది. ప్రయాణం మధ్యలో బస్సు మూడుసార్లు ఆగినప్పటికీ, యజమానికి సమాచారం ఇచ్చినా స్పందన లేకపోయినట్లు డ్రైవర్ తెలిపాడు.
బస్సు మళ్లీ స్టార్ట్ అయిన తర్వాత క్లీనర్ స్టీరింగ్ చేపట్టినట్లు, మార్కాపురం సమీపంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా క్లీనరే బస్సు నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడపడం వల్ల బీమా క్లెయిమ్‌లపై సమస్యలు తలెత్తే అవకాశముందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
