కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలి

కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలి
- తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మందుల సామెల్
మోత్కూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే.. కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తాయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ గురువారం మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సామెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజన్నగూడెం, ఆరే గూడెం,ఇందిరానగర్, సాయి బాబా కాలని,వడ్డెర కాలని,ధర్మాపురం లలో నిర్వహించిన ఇంటింటి ప్రచారం లో పాల్గొని అభ్యర్థుల గెలుపుకు విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ నెల 11 న జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటేసి 12 వార్డుల్లో అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ..కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
