
12వ వార్డులో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇంటింటి ప్రచారం
12వ వార్డులో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇంటింటి ప్రచారం
వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుపెల్లి వాణి–కుమారస్వామి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ. చివరి రోజు వినూత్న రీతిలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని ప్రజలతో మమేకమై, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినీ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వాటి ద్వారా లభిస్తున్న ప్రయోజనాలను తెలియజేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక పార్టీ శ్రేణులు, నాయకులు కార్యకర్తలు, ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.
