మహిళా ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి ప్రచారం

మహిళా ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి ప్రచారం

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డులో ప్రచారానికి ఆఖరి రోజు అయిన సోమవారం రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వారు ఓటర్లకు వివరించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మా వెంకటస్వామి, కౌన్సిలర్ అభ్యర్థి జెట్ట నీరజా సిద్ధులు , ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply