
1150 urea bags | పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ
1150 urea bags | పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ
- నర్సింహులపేటలో బారులు తీరిన రైతులు
1150 urea bags | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : యూరియా కోసం అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) నర్సింహులపేట మండల వ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. యూరియా కొరతతో రైతన్నలు పస్తులుండి క్యూ లైన్(Queue Line)లో ఉన్నా దొరకని పరిస్థితి ఏర్పడింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి 1150 యూరియా బస్తాలు(1150 urea bags) వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం నుంచే సొసైటీ వద్దకు చేరుకుని క్యూ కట్టారు. వివిధ గ్రామాల నుండి రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో స్థానిక ఎస్ఐ మాలోత్ సురేష్ పహార నడుమ రైతులకు కేవలం ఒకటి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు.
