100 Years | మండలికి ఘనంగా నివాళులు..

100 Years | మండలికి ఘనంగా నివాళులు..

100 Years, కోడూరు, ఆంధ్రప్రభ : పాలకాయతిప్ప బీసీ సంఘాల ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు (Mandali Venkata Krishna Rao) శత జయంతి వేడుకలు నిర్వహించారు. కోడూరు ప్రధాన సెంటర్లో మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి పూలమాలవేసి పాలకాయతిప్ప కూటమి నాయకులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ… పాలకాయ తిప్ప హంసలదీవి 1977, ఉప్పెన సమయంలో చీకట్లో మగ్గిపోతున్న ఈ గ్రామాలకు కరెంటు తీసుకువచ్చి వెలుగులు నింపిన మహానేత మండలి వెంకటకృష్ణారావు అన్నారు.

ఈ కార్యక్రమంలో కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరే గంగయ్య, జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కోట రాంబాబు, మాజీ కే డి సి సి బ్యాంక్ డైరెక్టర్ ముద్ధినేని చందర్రావు, కోడూరు నీటి సంఘాల వైస్ ప్రెసిడెంట్ బచ్చు పూర్ణచంద్రరావు, లింగారెడ్డి పాలెం పిఎసిఎస్ ఛైర్మన్ కోట సుబ్బారావు, బచ్చు వెంకటేష్, బడే భావన్నారాయణ, మాజీ డీసీ వైస్ ప్రెసిడెంట్ కాగిత రామారావు, కడవకొల్లు శ్రీనివాసరావు, కొల్లి వెంకటేశ్వరావు (చినబాబు), కడవకొల్లు రంగా, జరుగు ఆదినారాయణ, పరిసే వెంకటేశ్వరావు, మల్ల వెంకటేశ్వరరావు, కన్నలక్ష్మణరావు, విశంశెట్టి సాయిబాబు, బడే కృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply