100 percent | ఉపాధి హామీ పనులు వేగవంతంగా చేపట్టండి….

100 percent | ఉపాధి హామీ పనులు వేగవంతంగా చేపట్టండి….
100 percent | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పనులు వేగవంతంగా చేపట్టాలని ఊట్కూర్ ఇన్చార్జి ఎంపిడివో కొండన్న అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఎడవెల్లి, చిన్న పోర్ల గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఉపాధి హామీ పథకం చేపట్టిందని కూలీలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో కూలీలు ఉదయం వేళా పనులు చేసుకోవాలన్నారు. నర్సరీలలో 100 శాతం మొక్కలు పెంచే విధంగా చూడాలని మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధిగా పాటించాలన్నారు. నర్సరీలలో పెంచుతున్న మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు వెంటనే తొలగించి సంరక్షణ బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు.
ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న వివిధ పనులు పారదర్శకంగా చేపట్టాలన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో ఉపాధి పనులు వేగవంతంగా కొనసాగే విధంగా ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు జగదీష్, గౌతమ్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
