10 people | డిప్యూటీ కమిషనర్ సహా 10 మంది సస్పెన్షన్

10 people | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని బడంగ్‌పేట మున్సిపాలిటీలో చోటుచేసుకున్న అక్రమాలపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకుంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా పలువురు అధికారులను సస్పెండ్ చేసింది.

హైదరాబాద్ పరిధిలోని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి ఆరోపణలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక అధికారి పాలనలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైంది.

ఈ నివేదిక ఆధారంగా డిప్యూటీ కమిషనర్‌తో పాటు మొత్తం 10 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన అధికారులపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనతో బడంగ్‌పేట మున్సిపాలిటీలో అక్రమాలపై చర్చ మొదలైంది.

Leave a Reply