1 rupee ఇదీ..నా కథ..

1 rupee ఇదీ..నా కథ..
1 rupee ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కర్ణుని చావుకు కారణాలెన్నో..అని భారతానికి సంబంధించిన సామెత. నా క్షీణత-పతనానికి కూడా ఇది సరిగ్గా వర్తిస్తుంది. ఎందుకంటే, ఒక్కమాటలో మీరు నా విలువ (value) పడిపోయింది అని చెప్పుకునే ఈ పరిణామం వెనక ఎన్నెన్నో కారణాలున్నాయి. ఎందుకంటే, నా విలువ పెరగడం లేదా క్షీణించడం ఎప్పుడూ ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ చేతుల్లో ఉండదు. ఇది అనేక జాతీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక శక్తులు, ప్రభుత్వ విధానాలు, వీటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం, ఇలా అనేక కారణాలుంటాయి… నా విలువను పెరగకుండా నియంత్రించడం మరియు స్థిరంగా ఉంచడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ప్రధానమైన కీలక పాత్ర. మార్కెట్‌లో డాలర్ డిమాండ్ లేదా సరఫరాలో అస్థిరత ఉన్నప్పుడు ఆర్ బీ ఐ జోక్యం తప్పదు.
1 rupee ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్ల నిర్ణయాలు
నా విలువ క్షీణించినప్పుడు, విలువ పడిపోతున్నప్పుడు, ఆర్బీఐ (Reserve Bank Of India) తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించి, నన్ను(రూపాయలను) వెనక్కి పిలిపించుకుంటుంది. దీనివల్ల మార్కెట్‌లో డాలర్ సరఫరా పెరిగి, నా పతనం కొంతమేర ఆగుతుంది. నా విలువ వేగంగా పెరుగుతున్నప్పుడు, మార్కెట్ నుండి ఆర్బీఐ డాలర్లను కొనుగోలు చేసి, నన్ను సరఫరా చేస్తుంది. ఇది ఎగుమతులకు ఊతమివ్వడానికి ఉపయోగపడుతుంది. ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్ల నిర్ణయాలు పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి, అదికూడా నా విలువపై ప్రభావం పడుతుంది. మన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, వాణిజ్య విధానాలు నా విలువపై పరోక్షంగా ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ బడ్జెట్, ద్రవ్యలోటు మరియు రుణాల స్థాయి విదేశీ పెట్టుబడిదారుల నమ్మకంపై ప్రభావం చూపుతాయి. ఎగుమతులను ప్రోత్సహించడం మరియు దిగుమతులపై సుంకాలు విధించడం వల్ల వాణిజ్య లోటు తగ్గుతుంది, ఇది నాకు బలాన్నిస్తుంది. నా బలం ఆధారంగా దేశంలోకి డాలర్ల ప్రవాహాన్ని పెంచే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుంది.

నా విలువను అంతర్జాతీయ మార్కెట్ శక్తులు అత్యధికంగా ప్రభావితం చేస్తాయి. వీటిపై భారత్‌కు ఎలాంటి నియంత్రణ(Control) ఉండదు. భారతదేశం ప్రధానంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే, డాలర్‌కు డిమాండ్ పెరిగి నేను బలహీనమవుతాను. అమెరికన్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినప్పుడు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఉపసంహరించుకుని అమెరికన్ ఆస్తులలో పెడతారు దీనివల్ల కూడా నేను బలహీనమవుతుంటాను.
అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాలు లేదా భౌగోళిక రాజకీయ (Political) ఉద్రిక్తతలు, దేశాల మధ్య యుద్ధాలు, దేశాలలో అంతర్యుద్ధాలు ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు అమెరికన్ డాలర్ వైపు మొగ్గు చూపుతారు, ఈ పరిణామాలు నన్ను బలహీనపరుస్తాయి. విదేశీ వాణిజ్యం మరియు పెట్టుబడి ప్రవాహాలు నాయొక్క మారకపు రేటును రోజువారీగా నిర్ణయిస్తూంటాయి. దిగుమతిదారులు డాలర్లను కొనుగోలు చేస్తారు అంటే నా డిమాండ్‌ను పెంచుతారు. ఎగుమతిదారులు డాలర్లను విక్రయిస్తారు అంటే, నా సరఫరాను పెంచుతారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినప్పుడు డాలర్ ప్రవాహం పెరిగి నా బలం పెరుగుతుంది. ఉపసంహరించుకున్నప్పుడు నా బలం తగ్గుతుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే, నా విలువ అనేద్ ప్రభుత్వం, అంతర్జాతీయ మార్కెట్ పోకడలు మరియు పెట్టుబడిదారుల చర్యల మధ్య ఉన్న సంక్లిష్టమైన సమతుల్యత.
click here to read తక్కువ ప్రీమియం ఆఫర్లా? తస్మాత్ జాగ్రత్త!
