ఊట్కూర్‌లో ఘనంగారంజాన్ పర్వదినవేడుకలు…

ఊట్కూర్‌లో ఘనంగారంజాన్ పర్వదినవేడుకలు...

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పవిత్ర రంజాన్ పండగ వేడుకలు మైనార్టీ సోదరులు శనివారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజులపాటు నియమ నిష్ఠలతో ఉపవాసదీక్షలు చేపట్టిన మైనార్టీలు ఆయా గ్రామాల్లోని పురవీధుల గుండా అల్లాను స్మరిస్తూ ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు అలింగణం చేసుకొనిరంజాన్ పండుగశుభాకాంక్షలుతెలిపారు.

రంజాన్ వేడుకల్లో భాగంగా ఊట్కూర్ బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి నాయకులు ముస్లింలను కలుసుకొని పండగ శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద జట్రం లో సర్పంచ్ వాకిటి వెంకటేష్, పగిడిమర్రి లో సర్పంచ్ జాఫర్, బిజ్వార్ లో సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, చిన్న పొర్లలో సర్పంచ్ నికిత ప్రశాంత్, ఆధ్వర్యంలో ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఊట్కూర్ మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు మైనార్టీలను కలుసుకుని పండగ శుభాకాంక్షలుతెలిపారు. రంజాన్ వేడుకలను పురస్కరించుకొని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షించారు.

ఆయా కార్యక్రమాల్లో సింగిల్ విండో అధ్యక్షుడు బాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్య ప్రకాశ్ రెడ్డి, అరవింద్ కుమార్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఎల్కోటి నారాయణరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యగ్నేశ్వర్ రెడ్డి, ఉపసర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరంమల్లేష్, పట్టణ అధ్యక్షుడు లింగం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply