గోదావరిలో…
జన్నారం, ఆంధ్రప్రభ : గోదావరిలో ఓ యువకుడు గల్లంతైన విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా (Mancherial district) బాదంపల్లిరేవులో ఇవాళ ఉదయం జరిగిన విషాదకర సంఘటన ఇది. జన్నారం మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన గుండ శ్రావణ్ కుమార్(33) నానమ్మ సంవత్సరిక కార్యక్రమం శుక్రవారం పూర్తి చేసుకుని, శనివారం ఉదయం బాదంపల్లి గోదావరిరేవుకు స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేస్తూ ఓ మిత్రున్ని ఫోటో తీయడానికి శ్రవణ్ తన ఫోన్ ఇచ్చారు.
ఆ మిత్రుడు ఫోనులో ఫోటో తీస్తుండగానే ప్రమాదవశాత్తు గోదావరిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మండలంలోని పొనకల్ వాసి, సిమెంటు వ్యాపారి గుండ లచ్చన్నకు ముగ్గురు కుమారులు. అందులో మృతుడు రెండో కుమారుడు. మృతునికి ఇంకా వివాహం కాలేదు. గొల్లంతైన మృతదేహం ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గోదావరినీటి ప్రవాహంలో వెతుకుతున్నారు. యువకుడు గల్లంతైన విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై గొల్లపెల్లి అనూష తెలిపారు.

