28. కళల కన్నతండ్రి కళవళలాడును
అడుగు తీసి నీవు అడుగువేయ
వేణుగానలోల విశ్వరూపుడవయ్య
గీతదాత నీకు కేలుమోడ్తు
29. ద్వారకానగరము పేరు విన్నయెచాలు
ఒడలు పులకరించు ఒడుపుగాను
ఆలుమందలవిగో ఆర్ష సంస్కృతి గుర్తు
గీతదాత నీకు కేలుమోడ్తు
30. పూజలందులేదు పునరుక్తి దోషమ్ము
సూక్తి పలికినంత శక్తి వచ్చు
దైవనామమెపుడు ధ్యానించవలయును
గీతదాత నీకు కేలుమోడ్తు