CONGRESS| గెలుపు కోసం కృషి చేయాలి

CONGRESS| గెలుపు కోసం కృషి చేయాలి

  • సన్నాహక సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

CONGRESS| తిర్యాని, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘనవిజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క(Aathram Sugunakka) కోరారు. తిర్యాని మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చిత్తరి సాగర్(Chittri Sagar), సీనియర్ నాయకులు జువ్వజీ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ… గ్రామస్థాయి సమస్యలు, అభివృద్ధి అవసరాలను తీర్చటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజల్లో నమ్మకం ఏర్పరచాలన్నారు. పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామాల్లో సమన్వయం పెంచుకుంటూ, పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల(Sarpanch candidates) విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.

ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్తానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు(Special funds) అడుగుదామని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అంతక ముందు డీసీసీగా నియామకమైన తరువాత మొదటిసారి మండల కేంద్రానికి సుగుణక్క రావడంతో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించారు.

సమావేశంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పున్నం కుమార్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అమర్, మాజీ పెద్దగౌడ్లు పెరుమడ్ల, లచ్చన్న గౌడ్, గున్నాల సత్య గౌడ్, పెర్మల్ల బాలేష్ గౌడ్, స్థానిక నాయకులు, సర్పంచ్ ఆశావహులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply