YCP | ఘ‌నంగా రంగా వర్ధంతి

YCP | ఘ‌నంగా రంగా వర్ధంతి

  • వైసీపీ కార్యాలయంలో నివాళులు

YCP | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతిని అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆయ‌న చిత్ర పటానికి అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, యువ నాయకులు సింహాద్రి వికాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ హోదాలలోని పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రంగా గారి అభిమానులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply