తాటి చెట్టు పై నుండి పడి గీతకార్మికునికి గాయాలు

తాటి చెట్టు పై నుండి పడి గీతకార్మికునికి గాయాలు
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం లోని పాటిమట్ల గ్రామంలో వృత్తి రిత్యా తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారడంతో గ్రామానికి చెందిన రాచకొండ సుధాకర్ గౌడ్ తాటి చెట్టు పై నుండి జారి కింద పడ్డాడు.
ఈ సంఘటనలో సుధాకర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. సమీపంలో ఉన్న వ్యక్తులు చూసి వెంటనే ప్రయివేటు వాహనంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించారు.
