World Cup Final | కష్టాల్లో దక్షిణాఫ్రికా – ఆదిలోనే భారత్ బౌలర్ల విజృంభణ

కౌలాలంపూర్ – మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

అయితే పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది, పస్తుతం 8 ఓవర్లలో మూడు వికెట్ ల నష్టానికి 30 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా.

ఇదిఇలా ఉంటే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు.. దక్షిణాఫ్రికాపై అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. భారత్‌ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్‌ చేరిన దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది.

ఇక ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న తెలుగు అమ్మాయి గొంగడి త్రిషపై భారత్ మరోసారి ఆధారపడనుంది. ఈ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగుల బ్యాటర్‌గా త్రిష (265 పరుగులు)నే కొనసాగుతోంది.

తుది జట్లు దక్షిణాఫ్రికా : జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్‌), కరాబో మెసో(వికెట్ కీపర్‌), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నిని

భారత జట్టు: కమలిని(వికెట్ కీపర్‌), గొంగడి త్రిష, సానికా చల్కే, నికి ప్రసాద్(కెప్టెన్‌), ఈశ్వరి అవ్సరే, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత షబ్నం షకీల్, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మ

Leave a Reply