రైలు ఢీకొని మహిళ, కుమార్తె దుర్మరణం
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : భర్త ఆత్మహత్యాయత్యాన్నిఅడ్డుకోబోయిన భార్య, కుమార్తె బలైన దుర్ఘటన కాగజ్ నగర్ మండలం చింతగూడ(Chintaguda)లో చోటు చేసుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్( Asifabad) జిల్లాలోని కాగజ్ నగర్ మండలం చింతగూడ వద్ద ఇటుక బట్టీలో కూలి కోసం జార్ఖండ్ నుండి భార్యా పిల్లలతో జానకిరామ్ వలస వచ్చాడు. నిన్నరాత్రి అతిగా మద్యం తాగి భార్యతో గొడవపడి తాను ఆత్మహత్య చేసుకుంటానని కాగజ్ నగర్ – ఈస్ గాం రైల్వే ట్రాక్(Khagaj Nagar – Is Gam Railway Track) పై కూర్చున్నాడు.
భర్త చావును తప్పించేందుకు ఏడాది నిండని కుమార్తెను ఎత్తుకుని భార్య పరుగున రైల్వే ట్రాక్(Railway Track,) వద్దకు వచ్చి భర్తను ఆత్మహత్య చేసుకోవద్దని రైల్వే ట్రాక్ పై కాళ్లవేళ్ల పడి బతిమాలింది. అంతలోనే ఎదురుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో భార్య స్వప్న(25), పది నెలల కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాద ఘటన(incident) ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది. భర్త జగత్ రామ్(Jagat Ram) గాయాలతో ఆసుపత్రి పాలు కాగా భార్య, బిడ్డ మృతదేహాలు చూసి ఇటుక బట్టి కూలీలు కంటతడి పెట్టారు. పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వచ్చి రైల్వే ట్రాక్ పై ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రైల్వే పోలీసులు ఈ రోజు కాగజ్ నగర్‌లో పంచనామా నిర్వహించారు.

