MOVIE | ఎల్లమ్మ ఎవరు..?

MOVIE | బలగం అనే చిన్న సినిమాతో.. పెద్ద విజయం సాధించి సంచలనం సృష్టించాడు కమెడియన్ టర్నడ్ డైరెక్టర్ వేణు. తన రెండో సినిమా ఎల్లమ్మ(Ellamma) అని ఎప్పుడో ప్రకటించారు కానీ.. ఇంత వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ మూవీకి నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా కథను హీరో నానికి చెప్పడం.. నాని కథ బాగుందని చెప్పడంతో.. ఈ కాంబోలో ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అనుకున్నారు. అయితే.. నాని వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో కథ నచ్చినప్పటికీ నో చెప్పాడని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఇదే కథను హీరో విశ్వక్ సేన్ కి చెబితే.. అక్కడ కూడా ఇదే పరిస్థితి. కథ నచ్చినా.. వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో నో చెప్పాడని ఇండస్ట్రీలో వినిపించింది.
నాని, విశ్వక్ సేన్ తర్వాత ఈ కథ నితిన్ దగ్గరకు వెళ్లింది. నితిన్ (Nitin) హీరోగా బలగం వేణు ఎల్లమ్మ సినిమా ఖాయమైందని వార్తలు వచ్చాయి. ఇక త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే.. నితిన్ తమ్ముడు సినిమా డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ ఎల్లమ్మ సినిమా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ సినిమాకి భారీగా బడ్జెట్ అవసరం అవుతుందని.. నితిన్ తో చేస్తే వర్కవుట్ కాదనే ఉద్దేశ్యంతో నిర్మాత దిల్ రాజు వేరే హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆతర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే.. ఈ యంగ్ హీరోతో కూడా సెట్ కాలేదు.
ఫైనల్ గా రాక్ స్టార్ దేవిశ్రీతో ఫిక్స్ అయ్యింది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అయితే.. కథానాయిక ఎవరంటే.. కీర్తి సురేష్ (Keerthy Suresh) పేరు వినిపించింది. ఈ అమ్ముడను మీడియా మీట్ లో దీని గురించి అడిగితే.. ఈ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఫిదా బ్యూటీ సాయిపల్లవి పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్ మూవీ రామాయణ్ లో బిజీగా ఉంది. మరి.. సాయిపల్లవి ఈ సినిమాలో నటించేందుకు ఎస్ చెబుతుందా..? నో చెబుతుందా..? ఈ మూవీలో ఎవరు నటించనున్నారు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
