విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోనినిడుగుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు వివిధ వేషాధారణలో సర్వాంగ సుందరంగా ముస్తాబై స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ సంతోష్,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లత గ్రామస్తులు పాల్గొని ఉపాధ్యాయులైన విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంబ్లె శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని,భవిష్యత్తులో విద్యార్థులందరూ ఆదర్శ పౌరులుగా తయారయ్యి సమాజాభివృద్ధిలో భాగం కావాలని ఆకాంక్షించారు. కలెక్టర్ గా జగదీశ్, డిఈవోగా చైత్ర, ఎంఈవోగా జయలక్ష్మి,
ప్రధానోపాధ్యాయురాలిగా భానుప్రియ లు వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, మహమ్మద్ తఖి, మీర్ హిదాయాతుల్ల, శ్రీనివాస్ రావు, సుజాత, ఆంజనేయులు, శ్రీనివాస్, రవి, నర్సిములు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply