Khilashapur | ఏ తల్లి కన్నదో.. నడిరోడ్డుపై పసికందు..

రఘునాథపల్లి, జులై 16 (ఆంధ్రప్రభ) : జనగామ జిల్లా (Janagama district) రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం (Khilashapur) గ్రామంలో రోడ్డుపై పసికందును వదిలివెళ్లారు. తెల్లవారుజామున పసిపాప ఏడుపు వినిపిస్తుండటంతో అక్కడున్న గ్రామస్తులు చూసి.. అప్పుడే పుట్టిన మగ శిశువుగా గుర్తించి స్థానిక పోలీసులకు (police) సమాచారం అందించారు.
ఆ పసికందును పడేసేందుకు వెళుతుండగా నిద్రలోంచి లేచి ఏడవడంతో రోడ్డుపై వదిలేసి వారు పారిపోయినట్లు గ్రామస్థులు భావిస్తున్నారు. రఘునాథపల్లి ఎస్సై (Raghunathapalli SI) దూది మెట్ల నరేష్ యాదవ్ అక్కడికి చేరుకుని శిసువును అస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
