AP| రిజర్వేషన్లు అమలు చేయాలి…
సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు…
AP| తణుకు, ఆంధ్రప్రభ : సామాజిక న్యాయం, సమానత్వ సాధన దిశగా జనగణనలో కులగణన చేపట్టి, బడుగు, బలహీన వర్గాల జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్స్ అమలు చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు (Konala Bhimarao) డిమాండ్ చేశారు.
సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాపిత పిలుపుమేరకు జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం తణుకు తహసీల్దార్ కార్యాలయం (Tahsildar’s Office) వద్ద ధర్నా నిర్వహిచి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ డి.అశోక్ వర్మకు అందజేశారు.
ఈసందర్బంగా భీమారావు మాట్లాడుతూ… ఏపీలో 143 బీసీ కులాలు వున్నాయని కులగణన ద్వారా జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలన్నారు. నరేంద్రమోడీ (Narendra Modi) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, మహిళలపై దాడులు అధికమయ్యాయన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2023 లో ఎస్సీలపై జరిగిన నేరాలకు 57,789 కేసులు, ఎస్టీలపై 12,960 కేసులు, మహిళలపై 4.48 లక్షల కేసులు నమోదయ్యాయన్నారు.రాజ్యాంగ బద్ధహక్కులు ఉల్లంఘన జరుగుతుందన్నారు.
సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి మాట్లాడుతూ… దేశంలో అణచివేత, అంటరానితనం, కుల, మత వివక్షత పెట్రేగి పోతుందన్నారు. రాజ్యాంగం (Constitution) కల్పించిన హక్కులు అమలుకు నోచుకోవడం లేదన్నారు. సీపీఐ నాయకులు గుబ్బల వెంకటేశ్వరరావు, పుట్టా అమ్మిరాజు, పెండ్యాల దత్తాత్రేయ ప్రసాద్, పెదపోలు వెంకట్రావు, నక్కా బాలయ్య, సబ్బితి బ్రహ్మయ్య, డివిఎన్ హనుమంతరావు, పులవర్తి సత్యనారాయణ,కొంబత్తుల రవికుమార్,బొద్దాని మురళి, నమ్మి రాజు, నూనె రాధాకృష్ణ తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు.


