అర్జీలను పరిష్కరిస్తాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కర్నూలు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి(Minister BC Janardhan Reddy) ఆదేశించారు. నేటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను మంత్రి స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో సంబంధిత అధికారుల(officials)తో అక్కడిక్కడే ఫోన్ లో మాట్లాడి పరిష్కరించారు. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు, పింఛన్లు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలు ఆయన దృష్టికి రాగా ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి ఆధ్వర్యంలో నిర్వహంచిన ఈ అర్జీల స్వీకరణ(receiving applications) కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

