KRMB | కృష్ణా నదీ ప్రాజెక్టులపై ల‌డాయి – కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నోటీసులు

న్యూ ఢిల్లీ – కృష్ణానదీ పరివాహక ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టులన్నీ కేఆర్‌ఎంబీకి అప్పగించాలంటూ 2021 జులై 15న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ వేసిన పిటిషన్‌ను ఈరోజు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. అంతకు ముందు కృష్ణా నది ప్రాజెక్టుల నుంచి అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వాడుకుంటున్నారని, అందుకు అనుగుణంగా తెలంగాణ జారీ చేసిన జీఓ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్‌లను కలిపి సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.

కృష్ణా నదీ ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్లు దాఖలైన వారం రోజుల్లో రిజాయిండర్ ఫైల్ చేయాలని కూడా ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *