Swarnandhra | భాగస్వామ్యం కావాలి

Swarnandhra | భాగస్వామ్యం కావాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
Swarnandhra | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని పారిశుద్ధ్య చర్యలకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డీఆర్ఓ రాము నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలన్నారు. పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా, సామాజిక కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ముందుండాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకర జీవనానికి, సమాజ అభ్యున్నతికి, అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని ఆమె గుర్తుచేశారు. డీఆర్ఓ రాము నాయక్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సిబ్బంది కార్యాలయ ప్రాంగణంలో చెత్త తొలగింపు, మొక్కల సంరక్షణ, పరిసర పరిశుభ్రత వంటి శుభ్రత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ తో పాటు జెసి, అధికారులు, సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.
ఇది కూడా చదవండి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి
