పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ప్రతిష్టమైన పోలీసు బందోబస్తు
రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రజలందరూ పండగలను ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతంగా జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి జగ్ నే కి రాత్ పురస్కరించుకొని పట్టణంలోని మసీదుల వద్ద పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ హిందూ ముస్లింలు ఎవరైనా పర్వదినాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బందులు కాకుండా చూసుకోవాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనను చోటుచేసుకోకుండా కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. సిపి వెంట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తో పాటు పలువురున్నారు.
