ఇకపై మౌనంగా ఉండను

ఇకపై మౌనంగా ఉండను

ఆంధ్ర ప్రభ, వెబ్ డెస్క్: కన్నడ మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై హీరోయిన్ రష్మిక మందన్న మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నరని తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా నాపై తప్పుడు ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని సోషల్ మీడియాలో లేఖ విడుదల చేసింది. నేను ఎప్పుడు మాట్లాడని పదాలతో కొంతమంది తప్పుడు కథనాలు రాస్తున్నారని అన్నారు.

8 ఏళ్ల కిందటి ఒక ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా వ్యక్తిగత గోప్యతను బయట పెట్టి.. పరువు నష్టం కలిగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇకపై నేను మౌనంగా ఉండలేను, 24 గంటలు టైం ఇస్తున్న సోషల్ మీడియా, ఇన్ ప్లూయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాలను తొలగించాలి. లేకుంటే రేపటి నుంచి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటనాన్ని హెచ్చరించారు.

Leave a Reply