Warangal | గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక స‌హ‌కార సంఘాలు

Warangal | గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక స‌హ‌కార సంఘాలు

Warangal | రేగొండ, ఆంధ్రప్రభ : సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) అన్నారు. ఈ రోజు 72 వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా రేగొండ ప్రాథమిక సహకార కార్యాలయంలోని జరిగిన కార్యక్రమంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. సహకార వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తోందని అన్నారు. రైతు, కార్మికుడు, అభివృద్ధిలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయ‌ని చెప్పారు. ప్రభుత్వం సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు చేపట్టింద‌న్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు. వెంకటేశ్వరరావు, రామ్ ప్రసాద్, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్. గుటోజు కిష్టయ్య, పిఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, సీఈఓ. జగన్, నాయకులు. ఇప్పకాయల నర్సయ్య, ఆయా మండలాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply