Warangal | గాయాలపాలైన యువకుడు..

Warangal | గాయాలపాలైన యువకుడు..

  • మద్యం విషయంలో చెలరేగిన గొడవ

Warangal | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ రోజున చెన్నారావుపేట మండల కేంద్రంలో మద్యం విషయంలో చెలరేగిన గొడవ చివరికి ఓ యువకుడిని ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్ళింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గణేష్ అనే వ్యక్తి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి ఈర్యా తండాకు చెందిన ఓ బెల్ట్ షాప్ లో మద్యం(బీర్లు) తాగడానికి వెళ్లారు.

మద్యం తాగిన అనంతరం మరింత కావాలని కోరగా బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యం లేదని చెప్పడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో బెల్ట్ షాప్ నిర్వాహకులు సదరు యువకుడి తలపై కర్రల(రాడ్ )తో దాడి చేయడంతో తీవ్ర గాయలపాలయ్యాడు. యువకుడితో పాటు వచ్చిన స్నేహితులు దాడికి భయపడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో గాయాలతో ఉన్న యువకుడిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుల సూచనల ప్రకారం మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

యువకుడి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై యువకుడి కుటుంబ సభ్యులు సదరు దాడి చేసిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా.. యువకుడు తన భార్య పట్ల అమర్యాదకంగా, అసభ్యంగా ప్రవర్తించాడని షాప్ నిర్వాహకులు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ షాప్ నిర్వాహకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply