WAR | ఎక్సైజ్ సుంకం రూ.10 తగ్గింపు

WAR | ఎక్సైజ్ సుంకం రూ.10 తగ్గింపు

WAR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావంతో చమురు రంగంపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ఉపశమనం కల్పించింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చమురు కంపెనీలపై పెరుగుతున్న భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 చొప్పున తగ్గించినట్లు ప్రకటించింది.

తాజా నిర్ణయంతో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.13 నుంచి రూ.3కు తగ్గించబడింది. అదే విధంగా రూ.10 తగ్గింపుతో డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పూర్తిగా సున్నాకు చేరింది. ఈ నిర్ణయంతో చమురు మార్కెటింగ్ సంస్థలపై ఆర్థిక భారం కొంత మేర తగ్గనుండగా, భవిష్యత్తులో ఇంధన ధరల స్థిరీకరణకు కూడా ఇది దోహదం చేయవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply