IND vs ENG | దంచేస్తున్న గిల్.. అక్ష‌ర్ ప‌టేల్ !

నాగ్‌పూర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేలో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అధ‌ర‌గొడుతుంది. తొలుత‌ బౌలర్లు చెలరేగి ఇంగ్లండ్‌ను కొన్ని పరుగులకే పరిమితం చేయగా.. చేజింగ్ లో భార‌త‌ బ్యాటర్లు ఛేజింగ్‌లో దుమ్మురేపుతున్నారు.

ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (74), అక్షర్ పటేల్ (47) ఇంగ్లండ్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నారు. నిలకడగా ఆడుతూనే స్కోరు బోర్డుపై పరుగుల వ‌ర‌ద‌పారిస్తున్నారు.

సుభామన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా దూసుకుపోతుండ‌గా.. మరోవైపు అక్షర్ పటేల్ కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. కాగా, ప్రస్తుతం 31 ఓవర్లలో 208 పరుగులు చేసిన టీమిండియా.. విజయానికి ఇంకా 114 బంతుల్లో 41 పరుగులు చేయాల్సి ఉంది.

Leave a Reply