WAR | ఎల్ఎన్ జీ ఉత్పత్తి నిలిపివేత

WAR | ఎల్ఎన్ జీ ఉత్పత్తి నిలిపివేత

ధరల పెరుగుదల

WAR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ ఇంధన మార్కెట్ ఒక్కసారిగా కదిలిపోయింది. ఖతార్ ఎనర్జీ తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం యూరప్‌లో గ్యాస్ ధరలను 50 శాతం, ఆసియాలో 40 శాతం వరకు భారీగా పెంచేసింది.

ఇరాన్ హెచ్చరికలు, దాడులు, ఎయిర్‌స్పేస్ మూసివేతలు, షిప్పింగ్ రూట్లలో అంతరాయాలు ఏర్పడటంతో LNG సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ వంటి దేశాల్లో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలు, స్ట్రాటజిక్ రిజర్వ్స్ వినియోగం, దౌత్యపరమైన ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా తీవ్రమైతే ప్రపంచ ఇంధన మార్కెట్‌లో ఇంకా పెద్ద కలకలం రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply