కరీంనగర్, ఆంధ్రప్రభ : రైతులకు యూరియా(Urea) కష్టాలు వదలడం లేదు. పంటల రక్షణ కోసం అవసరమైన యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్(Culine)లో నిలబడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈరోజు కరీంనగర్(Karimnagar) జిల్లా కురిక్యాల సొసైటీ దగ్గర రైతులు తెల్లవారుజాము నుంచి యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్‌లో నిలబడిన రైతు రాజమల్లు స్పృహ తప్పిపడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న రైతు రాజమల్లును తోటి రైతులు, పోలీసులు సహాయంతో ఆసుపత్రికి తరలించారు.
యూరియా సరఫరాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు

