voting rights | నాగర్ కర్నూల్ జిల్లాలో పోలింగ్ 83.01 శాతం

voting rights | నాగర్ కర్నూల్ జిల్లాలో పోలింగ్ 83.01 శాతం

  • ఏడు మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసాయి..
  • ప్రశాంతంగా ముగిసిన 3వ విడత ఎన్నికల పోలింగ్…
  • నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,

voting rights | నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో 3వ‌ విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ(Polling process) శాంతియుతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ రోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రశాంతంగా కొనసాగిందన్నారు.

జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సజావుగా సాగినట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, పదరా, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడింది.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా ఏర్పాట్లు(security arrangements) పకడ్బందీగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో చివరి విడత పోలింగ్ శాతం 83.01, శాతం నమోదైంది. అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, పదరా, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లోని మొత్తం 1,79,464, ఓట్లలో(1,79,464 votes cast) పోలైన ఓట్లు 1,49,222.

అచ్చంపేట మండలంలో మొత్తం ఓటర్లు 30,675, మంది ఉండగా, 26,652, మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 86.09 శాతం నమోదు అయింది.
అమ్రాబాద్ మండలంలో మొత్తం ఓటర్లు 17,004, మంది ఉండగా, 12,852, మంది ఓటు హక్కు(voting rights) వినియోగించుకున్నారు. 75.06, శాతం నమోదు అయింది.
బల్మూరు మండలంలో మొత్తం ఓటర్లు 34,802, మంది ఉండగా, 28,037, మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.06, శాతం నమోదు అయింది.
లింగాల మండలంలో మొత్తం ఓటర్లు 31,190 ,మంది ఉండగా, 25,317,మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.02, శాతం నమోదు అయింది.
పదరా మండలంలో మొత్తం ఓటర్లు 15,838, మంది ఉండగా,12,909 , మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.05, శాతం నమోదు అయింది.
ఉప్పునుంతల మండలంలో మొత్తం ఓటర్లు 30,453, మంది ఉండగా, 26,576, మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87.03, శాతం నమోదు అయింది.
చారగొండ మండలంలో మొత్తం ఓటర్లు 19,502, మంది ఉండగా, 16,879, మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 86.06, శాతం నమోదు అయింది నాగర్ కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.

కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్ణీత సమయం అయిన మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసినప్పటికీ, అప్పటికే లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం గేట్లు మూసి, క్యూలైన్‌(queue)లో ఉన్న ప్రతి ఓటరు ఓటు వేసే వరకు పోలింగ్ కొనసాగించామని వివరించారు.

పోలింగ్ ప్రక్రియ మొత్తం శాంతియుతంగా ముగిసేలా జిల్లా యంత్రాంగం ముందస్తుగా సమన్వయంతో చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. అలాగే ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి గొడవలు, అపోహలు తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ అధికారుల(revenue officials)తో కలిసి తగిన భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.

Leave a Reply